20న జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్‌ | auto strike on 20th july | Sakshi
Sakshi News home page

20న జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్‌

Jul 17 2016 10:28 PM | Updated on Sep 4 2017 5:07 AM

ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులకు నిరసనగా ఈ నెల 20న జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్‌ నిర్వహించనున్నట్టు ఆటో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌పాషా తెలిపారు.

సంగారెడ్డి మున్సిపాలిటీ : ఆర్టీఏ, ట్రాఫిక్‌ పోలీసుల వేధింపులకు నిరసనగా ఈ నెల 20న జిల్లా వ్యాప్తంగా ఆటోల బంద్‌ నిర్వహించనున్నట్టు ఆటో యూనియన్‌ జిల్లా అధ్యక్షుడు తాహెర్‌పాషా తెలిపారు. ఆదివారం స్థానిక ఐబీలో నిర్వహించిన ఆటో యూనియన్‌ కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఆటో డ్రైవర్లపై అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయన్నారు.  బంద్‌ కార్యక్రమంలో ఆటో డ్రైవర్లు పాల్గొని విజయవంతం చేయాలన్నారు. బంద్‌ సందర్భంగా సంగారెడ్డి గంజ్‌ మైదాన్‌ నుంచి కలెక్టరేట్‌ వరకు ర్యాలీ చేపడతామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement