ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటో | auto hits rtc bus | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటో

Sep 23 2016 9:52 PM | Updated on Sep 4 2017 2:40 PM

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటో

ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన ఆటో

దువ్వ (తణుకు) : తణుకు మండలం దువ్వ సమీపంలో పదహారో నంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.

దువ్వ (తణుకు) : తణుకు మండలం దువ్వ సమీపంలో పదహారో నంబర్‌ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు, బాధితుల కథనం ప్రకారం.. ఏలూరు నుంచి తణుకు వైపునకు వెళ్తున్న తణుకు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సును అదే మార్గంలో వెళ్తున్న ఆటో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.  తాడేపల్లిగూడెంలో ఆటో ఎక్కిన తణుకు పట్టణానికి చెందిన హుచ్చానాయక్‌ మహీంద్ర, ఇరగవరం మండలం రేలంగి గ్రామానికి చెందిన కాసాని తాతయ్యబాబు, తాడేపల్లిగూడెం మండలం ఉప్పాకపాడు గ్రామానికి చెందిన షేక్‌ మీరాబీ, విజయవాడకు చెందిన వేలమూరి వెంకటేశ్వరశాస్త్రి గాయపడ్డారు. వీరితోపాటు మరో ఇద్దరు ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. ఆటో డ్రై వర్‌ పరారీలో ఉన్నట్లు రూరల్‌ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం తణుకు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రూరల్‌ ఎస్‌ఐ బి.జగదీశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.  
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement