ఆటోపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. డ్రైవర్ మృతి | auto driver killed in road accident in khammam district | Sakshi
Sakshi News home page

ఆటోపై విరిగిపడ్డ చెట్టు కొమ్మ.. డ్రైవర్ మృతి

Aug 11 2016 8:23 AM | Updated on Aug 30 2018 4:07 PM

వేగంగా వెళ్తున్న ఆటోపై చెట్టు కొమ్మ విరిగి పడింది.

అశ్వరావుపేట: వేగంగా వెళ్తున్న ఆటోపై చెట్టు కొమ్మ విరిగి పడింది. దీంతో ఆటో డ్రైవర్ మృతి చెందాడు. ఈ సంఘటన ఖమ్మం జిల్లా అశ్వరావుపేట మండలం వినాయకపురం సమీపంలో బుధవారం రాత్రి చోటుచేసుకుంది. వినాయకపురం నుంచి ప్రయాణికులతో వెళ్తున్న ఆటో పై చెట్టు కొమ్మ పడటంతో ఆటో డ్రైవర్ అక్కడికక్కడే మృతిచెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. అనంతరం పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని... మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని... పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement