అత్తింటి వేధింపులతో అల్లుడి ఆత్మహత్య | Attinti persecutions loops suicide | Sakshi
Sakshi News home page

అత్తింటి వేధింపులతో అల్లుడి ఆత్మహత్య

Dec 8 2016 10:36 PM | Updated on Nov 6 2018 7:56 PM

అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. పెద్దపప్పూరు ఎస్‌ఐ శ్రీహర్ష కథనం ప్రకారం...

పెద్దపప్పూరు:  అత్తింటి వారి వేధింపులు భరించలేక ఓ అల్లుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇది. పెద్దపప్పూరు ఎస్‌ఐ శ్రీహర్ష కథనం ప్రకారం... మండలంలోని చీమలవాగుపల్లికి చెందిన పెంచలయ్య(30) తాడిపత్రి మండలం బోడాయిపల్లికి చెందిన ఓ యువతిని ఏడాది కిందట పెళ్లి చేసుకున్నాడు. ఆమె నెల గర్భిణిగా ఉన్నప్పుడు మూర్ఛ వ్యాధి రావడంతో మృతి చెందింది. అప్పటి నుంచి తన బిడ్డ చావుకు నీవే కారణమంటూ అత్త గంగమ్మ వేధిస్తోంది. ఈ నేపథ్యంలోనే డబ్బుల కోసం గంగమ్మ తన ఇద్దరు కుమారులతో కలసి ఒత్తిడి తెస్తోంది. రెండ్రోజుల కిందటే పెంచలయ్య బైక్‌ను బలవంతంగా లాక్కున్నారు. దీంతో అవమానభారంతో అతను గురువారం ఆత్మహత్య చేసుకున్నట్లు వివరించారు. మృతుని జేబులో లభించిన సూసూడ్‌ నోట్‌ ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

 

 

Advertisement
 
Advertisement
Advertisement