లైంగిక దాడికి యత్నం | Attempted sexual assault | Sakshi
Sakshi News home page

లైంగిక దాడికి యత్నం

Dec 22 2016 10:31 PM | Updated on Sep 4 2017 11:22 PM

మండలంలోని గౌరాజుపల్లికి చెందిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం రాత్రి లైంగిక దాడికి యత్నించినట్లు గురువారం తమకు ఫిర్యాదు అ ందినట్లు ఎస్‌ఐ మునీర్‌ అహమ్మద్‌ తెలిపారు.

రొద్దం : మండలంలోని గౌరాజుపల్లికి చెందిన ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి బుధవారం రాత్రి లైంగిక దాడికి యత్నించినట్లు గురువారం తమకు ఫిర్యాదు అ ందినట్లు ఎస్‌ఐ మునీర్‌ అహమ్మద్‌ తెలిపారు. రాత్రి 8 గంటలకు బహిర్భూమికని ఇంటి సమీపంలోని కంపచెట్లలోకి వెళ్లగా అక్కడే మాటు వేసి ఉన్న సదరు వ్యక్తి ఆమె చెయ్యి పట్టుకుని బలవంతంగా లాగినట్లు ఫిర్యాదులో పేర్కొన్నట్లు వివరించారు. దీంతో ఆమె గట్టిగా కేకలు వేయగా అతను పారిపోయాడన్నారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement