చిట్టీ డబ్బులు ఇవ్వలేదని.. | attack on man who Did not give the money chit .. | Sakshi
Sakshi News home page

చిట్టీ డబ్బులు ఇవ్వలేదని..

Jun 5 2016 4:00 PM | Updated on Mar 28 2018 11:26 AM

చిట్టీ డబ్బులు ఇవ్వడంలేదని.. చిట్టీల వ్యాపారి తన అనుచరులతో కలిసి ఓ వ్యక్తి పై దాడి చేశాడు.

శంషాబాద్: చిట్టీ డబ్బులు ఇవ్వడంలేదని.. చిట్టీల వ్యాపారి తన అనుచరులతో కలిసి ఓ వ్యక్తి పై దాడి చేశాడు. దీంతో తీవ్ర గాయాలైన బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌లోని సిద్ధేశ్వర కాలనీకి చెందిన రాజు అనే వ్యక్తి స్థానిక చిట్టీల వ్యాపారి బట్టల రామస్వామి వద్ద చిట్టీ వేస్తున్నాడు. ఈ క్రమంలో గత రెండు నెలల నుంచి ఆర్థిక పరిస్థితులు బాలేకపోవడంతో సకాలంలో చిట్టీ డబ్బులు చెల్లించలేకపోయాడు. దీంతో కోపోద్రిక్తుడైన రామస్వామి తన అనుచరులతో కలిసి రాజుపై దాడి చేశాడు. బాధితుడు ఏయిర్‌పోర్టు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రంగంలోకి దిగిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement