ఉత్సాహంగా అథ్లెటిక్‌ మీట్‌ | athletic meet in anantapur | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా అథ్లెటిక్‌ మీట్‌

Jul 2 2017 11:24 PM | Updated on Jun 1 2018 8:39 PM

ఉత్సాహంగా అథ్లెటిక్‌ మీట్‌ - Sakshi

ఉత్సాహంగా అథ్లెటిక్‌ మీట్‌

నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ‘శివశంకర్‌ మెమోరియల్‌ అథ్లెటిక్‌ మీట్‌’ ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది.

అనంతపురం న్యూ సిటీ : నగరంలోని నీలం సంజీవరెడ్డి స్టేడియంలో ‘శివశంకర్‌ మెమోరియల్‌ అథ్లెటిక్‌ మీట్‌’ ఆదివారం ఉత్సాహంగా ప్రారంభమైంది. ఓపెన్‌ అథ్లెటిక్స్‌ మీట్‌లో అండర్‌ –14, 18 బాలురు, అండర్‌ –15 బాలికలు 100, 200, 400, 800 మీటర్లు, మూడు కిలోమీటర్ల పరుగు పందెం, లాంగ్‌జంప్, షాట్‌పుట్‌ విభాగాల్లో పోటీపడ్డారు. డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ క్రీడాకారులు గెలుపోటములు సమానంగా తీసుకుని ముందుకెళ్లాలన్నారు. ఆకస్మికంగా మృతి చెందిన తోటి క్రీడాకారుడి స్మారకార్థం అథ్లెటిక్స్‌ మీట్‌ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మేయర్‌ స్వరూప, సీఐలు సాయిప్రసాద్, తబ్రేజ్, ఎస్‌ఐ హమీద్‌ఖాన్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement