60 ఏళ్లు ఆపై వయసు కలిగి, కుటుంబ ఆదాయం నెలసరి రూ.15 వేలు మించని వయోవృద్ధులు చేతి కర్రల కోసం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ జిల్లా మేనేజర్ రవీంద్ర మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
చేతి కర్రల కోసం దరఖాస్తు చేసుకోండి
Jul 20 2016 1:04 AM | Updated on Aug 20 2018 3:21 PM
అనంతపురం అర్బన్: 60 ఏళ్లు ఆపై వయసు కలిగి, కుటుంబ ఆదాయం నెలసరి రూ.15 వేలు మించని వయోవృద్ధులు చేతి కర్రల కోసం కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ విభిన్న ప్రతిభావంతులు, వయో వృద్ధుల సహాయ సంస్థ జిల్లా మేనేజర్ రవీంద్ర మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కార్యాలయం నుంచి నమూనా ఫార ం తీసుకుని సివిల్ అసిస్టెంట్ సర్జన్‌తో సంతకం, ఆదాయ ధ్రువపత్రం, ఆధార్‌కార్డు నకలు, రెండు పాస్‌పోర్ట్ సైజు ఫొటోలు జతచేసి బుడ్డప్పనగర్‌లోని సంస్థ కార్యాలయానికి పంపాలన్నారు. వివరాలకు 08554–232380 నెంబర్‌లో సంప్రదించాలన్నారు.
Advertisement
Advertisement