ఫైనల్‌కు అనంత జట్టు | anantapur team on final | Sakshi
Sakshi News home page

ఫైనల్‌కు అనంత జట్టు

Nov 12 2016 11:41 PM | Updated on Jun 1 2018 8:31 PM

విజయనగరంలో నిర్వహిస్తున్న అండర్‌–14 క్రికెట్‌ పోటీల్లో కృష్ణా జట్టు పై అనంత జట్టు విజయం సాధించి ఫైనల్‌కు చేరింది.

అనంతపురం సప్తగిరి సర్కిల్‌ : విజయనగరంలో  నిర్వహిస్తున్న అండర్‌–14 క్రికెట్‌ పోటీల్లో  కృష్ణా జట్టు పై అనంత జట్టు విజయం సాధించి  ఫైనల్‌కు చేరింది.   అనంత జట్టు తన మొదటి ఇన్నింగ్స్‌లో 306 పరుగులు చేసింది. శ్రీయాస్‌ 89 పరుగులు సాధించాడు. జట్టు కెప్టె¯ŒS దత్తారెడ్డి 99 పరుగులకు ఔట్‌ అయి సెంచరీని చేజార్చుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన కృష్ణా జట్టు అనంత బౌలర్ల ధాటికి 139 పరుగులకే కుప్పకూలింది.

అనంత జట్టులోని ఆనంద్‌ 5 వికెట్లు, ప్ర«శాంత్‌ 2 వికెట్లు  తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్‌ అనంత జట్టు 90 పరుగులకు 5 వికెట్లు కోల్పోయింది. దీంతో అనంత జట్టు మొదటి ఇన్నింగ్స్‌ ఆ««ధిక్యతతో విజయాన్ని సాధించింది. అనంత జట్టులో కెప్టె¯ŒS దత్తారెడ్డి తన అద్భుతమైన ఇన్నింగ్స్‌తో సెమీఫైనల్స్‌లో విజయానికి బాట వేశాడు.  అనంత జట్టు రెండేళ్లుగా అండర్‌ –14 విజేతగా నిలుస్తోంది. ప్రస్తుతం   వరుసగా మూడోసారి ఫైనల్‌కు చేరింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement