ఆం«ధ్ర సీనియర్ క్రికెట్ వన్డే జట్టుకు జిల్లాకు చెందిన క్రీడాకారులు షోయబ్ మహమ్మద్ ఖాన్, డీ బీ ప్రశాంత్‌కుమార్ ఎంపికయ్యారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు.
అనంతపురం సప్తగిరి సర్కిల్ : ఆం«ధ్ర సీనియర్ క్రికెట్ వన్డే జట్టుకు జిల్లాకు చెందిన క్రీడాకారులు షోయబ్ మహమ్మద్ ఖాన్, డీ బీ ప్రశాంత్‌కుమార్ ఎంపికయ్యారని జిల్లా క్రికెట్ సంఘం కార్యదర్శి బీఆర్ ప్రసన్న తెలిపారు. డీ బీ ప్రశాంత్‌కుమార్ 2016-17 సీజన్‌లో 695 పరుగులతో అత్యుత్తమ బ్యాటింగ్ ప్రదర్శన చేసి జట్టులో స్థానాన్ని పదిలం చేసుకున్నాడు.
షోయబ్ మహమ్మద్ ఖాన్ ఇటీవల చెన్నైలో టీ-20 అంతర్రాష్ట్ర పోటీల్లో తన ఆఫ్ స్పిన్ మాయాజాలంతో వికెట్లను పడగొట్టడంతో జట్టులో తన స్థానాన్ని నిలుపుకొన్నాడు. ఎంపికైన క్రీడాకారులు ఈ నెల 25 నుంచి చెన్నైలో జరిగే బీసీసీఐ విజయ్ హరారే ట్రోఫీలో పాల్గొంటారన్నారు. వీరి ఎంపికపై జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్ష, కార్యదర్శులు మాంచో ఫెర్రర్, బీఆర్ ప్రసన్న హర్షంవ్యక్తం చేశారు.