విజేత అనంత హాస్పిటల్‌ జట్టు | anantapur hospital won in volley ball tourny | Sakshi
Sakshi News home page

విజేత అనంత హాస్పిటల్‌ జట్టు

Jun 11 2017 11:42 PM | Updated on Jun 1 2018 8:39 PM

విజేత అనంత హాస్పిటల్‌ జట్టు - Sakshi

విజేత అనంత హాస్పిటల్‌ జట్టు

రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నీ విజేతగా అనంతపురం హాస్పిటల్‌ జట్టు నిలిచింది.

అనంతపురం సప్తగిరిసర్కిల్‌ : రాష్ట్రస్థాయి వాలీబాల్‌ టోర్నీ విజేతగా అనంతపురం హాస్పిటల్‌ జట్టు నిలిచింది. జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో 9 నుంచి 11 వరకు నగరంలోని నీలం సంజీవరెడ్డి క్రీడా మైదానంలో రాష్ట్రస్థాయి వాలీబాల్‌ పోటీలు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం ఫైననల్‌ పోరులో అనంతపురం ఎస్‌ఆర్‌ స్టేడియం, అనంతపురం హాస్పిటల్‌ జట్లు తలపడ్డాయి. మొదటి సెట్‌ను అనంతపురం ఎస్‌ఆర్‌ స్టేడియం జట్టు గెలుచుకోగా, రెండవ సెట్‌ను అనంతపురం హాస్పిటల్‌ జట్టు గెలుచుకుంది. చివరి సెట్‌ పోటీ హోరాహోరీగా సాగింది. ప్రతి సర్వీస్‌లోనూ ఇరు జట్లు సమాన పాయింట్లు సాధించాయి. చివరికి హాస్పిటల్‌ జట్టు రెండు పాయింట్ల తేడాతో విజయం నమోదు చేసింది. దీంతో ఈ టోర్నీలో మొదటిస్థానంలో అనంతపురం హాస్పిటల్‌, రెండవస్థానంలో అనంతపురం ఎస్‌ఆర్‌ స్టేడియం, మూడవ స్థానంలో వైఎస్సార్‌ కడప, నాల్గవ స్థానంలో పామిడి జట్లు నిలిచాయి. విజేత జట్లకు వరుసగా రూ.20వేలు, రూ.15వేలు, రూ.10 వేలు, రూ.5 వేలు చొప్పున నగదు బహుమతులు అందజేశారు.  
 
 గెలుపోటములను సమానంగా తీసుకోవాలి
–ట్రాఫిక్‌ డీఎస్పీ నరసింగప్ప
క్రీడాకారులు గెలుపోటములను సమానంగా తీసుకుని ముందుకు సాగాలని ట్రాఫిక్‌ డీఎస్పీ నరసింగప్ప తెలిపారు. విజేత జట్లకు బహుమతుల ప్రదానోత్సవ కార్యక్రమానికి ట్రాఫిక్‌ డీఎస్పీతోపాటు డీఎస్‌డీఓ బాషామోహిద్దీన్, జిల్లా వాలీబాల్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, షిర్డీ సాయి స్వీట్స్‌ ప్రొప్రైటర్‌ భవానీ రవికుమార్, సీఐలు తబ్రేజ్, రియాజ్, సీనియర్‌ ప్లేయర్లు మోహన్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, అల్లాబకాష్‌ ముఖ్య అతిధులుగా హాజరయ్యారు. వన్‌టౌన్‌ సీఐ సాయిప్రసాద్‌ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడారు. కార్యక్రమంలో జిలా వాలీబాల్‌ అసోసియేషన్‌ కార్యదర్శి కొండారెడ్డి, కొగటం విజయభాస్కర్‌రెడ్డి, కోచ్‌లు మనోహర్‌రెడ్డి, జీవన్, జబీర్, ప్రవీణ్‌కుమార్, గౌడ్, మంజుల, రామాంజినేయులు, రమేష్, ఎస్‌ఎస్‌బీఎన్‌ పీడీ చంద్ర తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement