గుర్తు తెలియని వృద్ధుడి మృతి | An elderly killed hyderabad | Sakshi
Sakshi News home page

గుర్తు తెలియని వృద్ధుడి మృతి

Aug 1 2016 5:51 PM | Updated on Sep 4 2017 7:22 AM

గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వృద్దుడు మృతి చెందిన ఘటన బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలో వెలుగుచూసింది.

గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వృద్దుడు మృతి చెందిన ఘటన బోయిన్‌పల్లి పీఎస్ పరిధిలో వెలుగుచూసింది. పోలీసులు అందించిన వివరాల ప్రకారం గత నెల 22న రాత్రి పదిగంటల సమయంలో పాతబోయిన్‌పల్లి చెక్‌పోస్టు సమీపంలో గుర్తు తెలియని వృద్దుడు(65) రోడ్డు పక్కన అపాస్మరకస్థితిలో గాయాలతో ఉండటంతో స్థానికులు బ్లూకోల్ట్ట్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని వృద్దుడిని 108లో గాంధీకి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెండు రోజుల క్రితం మృతి చెందాడు, సంబంధీకులు బోయిన్‌పల్లి పోలీసులను సంప్రదించాలని కోరారు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement