అగ్నిప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఈ దుర్ఘటన ఆదివారంరాత్రి జువ్వలపాలెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం..
వ్యక్తి సజీవ దహనం
Jan 10 2017 2:05 AM | Updated on Jul 6 2019 12:36 PM
తాడేపల్లిగూడెం రూరల్ : అగ్నిప్రమాదంలో ఓ వ్యక్తి సజీవదహనమయ్యాడు. ఈ దుర్ఘటన ఆదివారంరాత్రి జువ్వలపాలెంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని జువ్వలపాలెం శివాలయం ఎదురుగా కాలువ గట్టుపై పాక వేసుకుని బాదపతి చిట్టిరాజు (70) నివాసముంటున్నాడు. అనారోగ్యంతో కొంతకాలంగా మంచాన పడ్డాడు. ఇతని యోగక్షేమాలను సోదరుడు బాదపతి రాము చూస్తున్నాడు. చిట్టిరాజుకు చుట్ట కాల్చే అలవాటు ఉండటంతో రోజులానే ఆదివారం రాత్రి చుట్ట అంటించుకుని ఆ తర్వాత ఆర్పకుండా మంచం పక్కన పెట్టేశాడు. దీంతో పాకకు నిప్పు అంటుకుని దగ్ధమైంది. ఫలితంగా చిట్టిరాజు సజీవ దహనమయ్యాడు. మృతుని సోదరుడు రాము ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్సై ఎం.సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement