2న ఏఐటీయూసీ దేశవ్యాప్త సమ్మె | AITUC samme on september 2nd | Sakshi
Sakshi News home page

2న ఏఐటీయూసీ దేశవ్యాప్త సమ్మె

Aug 27 2016 8:36 PM | Updated on Sep 4 2017 11:10 AM

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఏఐటీయూసీ నాయకులు

పోస్టర్‌ ఆవిష్కరిస్తున్న ఏఐటీయూసీ నాయకులు

సెప్టెంబర్‌ 2న నిర్వహించే దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ భవననిర్మాణ కార్మికసంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్‌ పేర్కొన్నారు.

చేగుంట: సెప్టెంబర్‌ 2న నిర్వహించే దేశవ్యాప్త కార్మిక సంఘాల సమ్మెను విజయవంతం చేయాలని ఏఐటీయూసీ భవననిర్మాణ కార్మికసంఘం జిల్లా  ప్రధాన కార్యదర్శి అయ్యవారి లక్ష్మణ్‌ పేర్కొన్నారు. చేగుంటలో ఆయన సమ్మె పోస్టర్‌ను ఆవిష్కరించి  విలేకరులతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలపై సెప్టెంబర్‌  2న పది కార్మిక సంఘాలతో సమ్మె నిర్వహిస్తున్నట్లు తెలిపారు.

60 సంవత్సరాలు దాటిన కార్మికులకు 3వేల పెన్షన్‌, కార్మికుల పిల్లలకు స్కాలర్‌ షిప్పులు, డబుల్ బెడ్‌ రూం ఇళ్లనిర్మాణం, కనీస వేతన పెంపు, సకాలంలో కార్మిక సంఘాల రిజిస్టేషన్‌ తదితర అంశాలపై పోరాడుతున్నట్లు తెలిపారు. సెప్టెంబర్‌ 2న జరిగే సమ్మెలో అన్ని సంఘాల కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.  సమావేశంలో కార్మిక నాయకులు శంకర్‌ , కుమార్‌, రాములు, యాదగిరి  తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement