మోటార్‌సైక్లిస్ట్‌ దుర్మరణం | accident.. motor cyclist dead | Sakshi
Sakshi News home page

మోటార్‌సైక్లిస్ట్‌ దుర్మరణం

Dec 26 2016 1:37 AM | Updated on Sep 4 2017 11:35 PM

ఉంగుటూరు మండలం రాచూరు వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు.

రాచూరు (ఉంగుటూరు): ఉంగుటూరు మండలం రాచూరు వద్ద ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరు తీవ్రగాయాలపాలయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద నిండ్రకొలనుకు చెందిన చిన్నం కిషోర్‌ (26), అతని స్నేహితుడు దాసరి రవి కలిసి మోటార్‌ సైకిల్‌పై తాడేపల్లిగూడెం వెళ్తుండగా  నారాయణపురం నుంచి గణపవరం వైపు వెళుతున్న చేప పిల్లల లోడు లారీ ఎదురుగా వచ్చి వీరిని ఢీకొట్టింది. దీంతో మోటార్‌ సైకిల్‌ నడుపుతున్న చిన్నం కిషోర్‌ తలకు బలమై గాయాలై అక్కడికక్కడే మృతిచెందాడు. వెనుక ఉన్న రవికి తీవ్రగాయాలు కావడంతో ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. చేబ్రోలు ఏఎస్‌ఐ రమణకేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement