తృటిలో తప్పిన ప్రమాదం | Accidend Narrowly missed | Sakshi
Sakshi News home page

తృటిలో తప్పిన ప్రమాదం

Aug 15 2016 5:45 PM | Updated on Sep 4 2017 9:24 AM

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలోని ఐల్లూరు ఘాట్ వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది.

కృష్ణాజిల్లా తోట్లవల్లూరు మండలంలోని ఐల్లూరు ఘాట్ వద్ద తృటిలో పెను ప్రమాదం తప్పింది. ప్రొక్లైనర్‌తో వెళ్తున్న లారీ అదుపుతప్పి ఘాట్‌పైకి దూసుకొచ్చింది. ఆ ప్రాంతంలో పుణ్య స్నానం ఆచరిస్తున్న భక్తులు ఇది గుర్తించి వెంటనే పక్కకు తప్పుకోవడంతో.. పెను ప్రమాదం తప్పింది. లారీ కృష్ణానదిలోకి దూసుకెళ్లింది. ఘాట్ మెట్ల సమీపంలో పనులు నిర్వహించిన ప్రొక్లైనర్‌ను లారీ పై ఎక్కించి తీసుకెళ్తుండగా.. అదుపుతప్పిన లారీ నదిలోకి దూసుకెళ్లింది. అదే సమయంలో అక్కడ స్నానం చేస్తున్న సుమారు 10 మంది భక్తులు ఇది గుర్తించి పక్కకు తప్పుకోవడంతో.. ప్రమాదం తప్పింది.

 

Advertisement
 
Advertisement
Advertisement