సీఐ బాలకృష్ణ ఇళ్లపై ఏసీబీ దాడులు | acb raids on visakha ci balakrishna house | Sakshi
Sakshi News home page

సీఐ బాలకృష్ణ ఇళ్లపై ఏసీబీ దాడులు

Jun 22 2016 9:08 AM | Updated on Aug 17 2018 12:56 PM

సీఐ బాలకృష్ణ ఇళ్లపై ఏసీబీ దాడులు - Sakshi

సీఐ బాలకృష్ణ ఇళ్లపై ఏసీబీ దాడులు

విశాఖలో అవినీతి నిరోధక శాఖాధికారులు బుధవారం ఉదయం మెరుపు దాడులకు దిగారు.

విశాఖపట్నం: విశాఖలో అవినీతి నిరోధక శాఖాధికారులు బుధవారం ఉదయం మెరుపు దాడులకు దిగారు. విశాఖ 4వ టౌన్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాలకృష్ణ ఇళ్లపై సోదాలు నిర్వహిస్తున్నారు.

విశాఖపట్నం పీఎం పాలెంలోని బాలకృష్ణ నివాసంతో పాటు 4వ టౌన్ పీఎస్, విజయనగరం, కొవ్వూరు సహా మొత్తం ఏడు చోట్ల ఆయన బంధువుల ఇళ్లపై ఏకకాలంలో దాడులు చేస్తున్నారు. పోలీస్ స్టేషన్లో పలు కీలక డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బాలకృష్ణ ఆదాయానికి మించి ఆస్తులున్నాయన్న ఆరోపణలతో ఈ దాడులు జరుగుతున్నాయి. ఆయన నివాసంలో రూ.కోటిన్నర పైగా అక్రమాస్తుల గుర్తించినట్లు తెలుస్తుంది. వీటిలో మూడంతస్తుల భవనం, 25 తులాల బంగారం, కేజీన్నర వెండి, రూ.30 వేలు నగదు ఉన్నట్లు సమాచారం. కొవ్వూరులోని బాలకృష్ణ మామ వెంకటరత్నం ఇంట్లో సోదాలు జరుగుతున్నాయి. ఈ సోదాల్లో భారీగా అక్రమ ఆస్తులను గుర్తించారు. వివరాలు వెల్లడించడానికి ఏసీబీ అధికారులు నిరాకరిస్తున్నారు. ప్రస్తుతం దాడులు కొనసాగుతున్నాయి. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement