టెక్నోత్లాన్‌కు ‘అభ్యాస్‌’ విద్యార్థుల ఎంపిక | Abhyas students selected for Technotlahan | Sakshi
Sakshi News home page

టెక్నోత్లాన్‌కు ‘అభ్యాస్‌’ విద్యార్థుల ఎంపిక

Aug 24 2016 10:12 PM | Updated on Apr 8 2019 6:20 PM

టెక్నోత్లాన్‌కు ‘అభ్యాస్‌’ విద్యార్థుల ఎంపిక - Sakshi

టెక్నోత్లాన్‌కు ‘అభ్యాస్‌’ విద్యార్థుల ఎంపిక

పట్టణంలోని అభ్యాస్‌ టెక్నో స్నూల్‌ విద్యార్థులు ఐఐటీ గౌహతి వారు నిర్వహించిన టెక్నోత్లాన్‌ ప్రోగ్రామ్‌కు ఎంపికైనట్లుగా అభ్యాస్‌ స్కూల్‌ చైర్మన్‌ వంగాల పుష్పలతా నిరంజన్‌రెడ్డి తెలిపారు.

మిర్యాలగూడ : పట్టణంలోని అభ్యాస్‌ టెక్నో స్నూల్‌ విద్యార్థులు ఐఐటీ గౌహతి వారు నిర్వహించిన టెక్నోత్లాన్‌ ప్రోగ్రామ్‌కు ఎంపికైనట్లుగా అభ్యాస్‌ స్కూల్‌ చైర్మన్‌ వంగాల పుష్పలతా నిరంజన్‌రెడ్డి తెలిపారు. పాఠశాలకు చెందిన సౌషిత్, కార్తీక్‌లు జిల్లా ఫస్ట్‌ ర్యాంకు, తెలంగాణా రీజియన్‌లో మూడో ర్యాంకు సాధించినట్లు తెలిపారు. వీరికి ఐఐటీ గౌహతి వారు గోల్డ్‌మెడల్స్, సర్టిఫికెట్లు అందజేస్తారని, వీరితో పాటు మరో ఆరుగురు విద్యార్థులకు సిల్వర్‌ మెడల్, సర్టిఫికెట్లు అందజేస్తారని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా ఎంపికైన విద్యార్థులను పాఠశాల ఉపాధ్యాయులు అభినందించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement