కొత్త సంవత్సరం వేడుకలకు తండ్రి డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
జామాబాద్ క్రైమ్: కొత్త సంవత్సరం వేడుకలకు తండ్రి డబ్బులు ఇవ్వలేదని ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన మెండు సాగర్ (20) తన మిత్రులతో కలిసి కొత్త సంవత్సరం వేడుకలు చేసుకునేందుకు తండ్రి గంగాధర్‌ను డబ్బులు అడిగాడు.
తండ్రి డబ్బులు ఇవ్వకపోవడంతో మనస్తాపం చెందిన సాగర్ గురువారం అర్ధరాత్రి మేడ మీద ఉన్న తన గదిలోకి వెళ్లి ఫ్యాన్‌కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం ఉదయం గుర్తించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మూడో టౌన్ ఎస్సై శ్రీహరి తెలిపారు.