బాకీ తీర్చు.. లేకుంటే మా పాపను పెంచు! | A couple left two months baby | Sakshi
Sakshi News home page

బాకీ తీర్చు.. లేకుంటే మా పాపను పెంచు!

Apr 4 2016 4:40 AM | Updated on Aug 21 2018 5:46 PM

బాకీ తీర్చు.. లేకుంటే మా పాపను పెంచు! - Sakshi

బాకీ తీర్చు.. లేకుంటే మా పాపను పెంచు!

బాకీ తీర్చడం కోసం ఓ దంపతులు వింత షరతు పెట్టారు. బాకీ తీర్చాలని, లేకుంటే తమ పాప (2నెలలు)ను నువ్వే పెంచుకోవాలని పసికందును అక్కడే వదిలిపెట్టి పోయారు.

ఆటోలో రెండు నెలల పసికందును వదిలిపెట్టిన దంపతులు

 జడ్చర్ల టౌన్: బాకీ తీర్చడం కోసం ఓ దంపతులు వింత షరతు పెట్టారు. బాకీ తీర్చాలని, లేకుంటే తమ పాప (2నెలలు)ను నువ్వే పెంచుకోవాలని పసికందును అక్కడే వదిలిపెట్టి పోయారు. ఈ ఘటన మహబూబ్‌నగర్ జిల్లా బాదేపల్లిలో ఆదివారం చోటుచేసుకుంది. జడ్చర్ల మండలం కొత్తతండాకు చెందిన సిద్దూ జడ్చర్లలో ఆటో నడుపుతుంటాడు. ఇతనికి అక్క వరసయ్యే అదే తండాకు చెందిన సువర్ణ ఆమె భర్త ప్రేమ్‌కుమార్‌లకు రూ.8 వేలు బాకీ ఉన్నాడు.

ఈ క్రమంలో బాదేపల్లి పట్టణానికి వచ్చిన సువర్ణ, ప్రేమ్‌కుమార్‌లు ఆదివారం సాయంత్రం సిద్దూ ఆటో ఎక్కారు. నేతాజీ చౌరస్తానుంచి స్టేషన్‌కు వెళ్లే మార్గంలో వాసవి కమాన్ వద్దకు చేరుకోగానే అప్పుకట్టాలని సిద్దూపై ఒత్తిడి తెచ్చారు. త్వరలోనే తీరుస్తానని చెప్పినప్పటికీ వారు వినకుండా అప్పు తీర్చే వరకు మా పాపను నువ్వే పెంచుకో అంటూ ఆటోలో పసికందును వదిలిపెట్టి పరుగు లంఘించారు. అవాక్కయిన సిద్దూ.. వెంటాడగా ప్రేమ్‌కుమార్ చిక్కాడు. సువర్ణ తప్పించుకుంది. స్థానికులు ప్రేమ్‌కుమార్‌ను చితకబాది పోలీసులకు సమాచారం అందించారు. వారు ప్రేమ్‌కుమార్‌కు కౌన్సెలింగ్ నిర్వహించి పాపను అప్పగించారు.

Advertisement
 
Advertisement
Advertisement