తులసీరెడ్డి హత్య కేసులో 9 మంది అరెస్ట్ | 9 people arrested in tulasi reddy murder case | Sakshi
Sakshi News home page

తులసీరెడ్డి హత్య కేసులో 9 మంది అరెస్ట్

Apr 13 2016 1:05 PM | Updated on Sep 3 2017 9:51 PM

కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి అనుచరుడు, న్యాయవాది తులసీరెడ్డి హత్య కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు.

కర్నూలు : కర్నూలు జిల్లా నంద్యాల టీడీపీ నాయకుడు, మాజీ మంత్రి శిల్పా మోహన్రెడ్డి అనుచరుడు, న్యాయవాది తులసీరెడ్డి హత్య కేసులో తొమ్మిది మందిని అరెస్ట్ చేసినట్లు పోలీసులు బుధవారం వెల్లడించారు. ఈ ఏడాది మార్చి 29వ తేదీన నంద్యాల పట్టణంలో శిల్పా మోహన్ రెడ్డి ప్రధాన అనుచరుడు, న్యాయవాది తులసిరెడ్డిపై దుండగులు దాడి చేశారు. ఈ దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే స్పందించి.. ఆయన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించారు.

అయితే ఆయన పరిస్థితి విషమంగా మారడంతో ... మెరుగైన వైద్య చికిత్స కోసం  హైదరాబాద్ తరలించాలని వైద్యులు సూచించారు. ఈ నేపథ్యంలో ఆయన  హైదరాబాద్లోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా తొమ్మిది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement