తొమ్మిది మందికి గాయాలు | 9 Injuries in accident | Sakshi
Sakshi News home page

తొమ్మిది మందికి గాయాలు

Nov 28 2016 11:01 PM | Updated on Apr 3 2019 7:53 PM

తూమకుంట పారిశ్రామికవాడలో గోళాపురం రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. హెడ్‌కానిస్టేబుల్‌ అక్బర్‌ తెలిపిన మేరకు...

హిందూపురం రూరల్‌ : తూమకుంట పారిశ్రామికవాడలో గోళాపురం రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తొమ్మిది మంది గాయపడ్డారు. హెడ్‌కానిస్టేబుల్‌ అక్బర్‌ తెలిపిన మేరకు... పారిశ్రామిక వాడలోని టెక్స్‌టైల్‌ పరిశ్రమలో పనిచేస్తున్న మహిళలు లేపాక్షి మండలం పులమతి, హిందూపురం మండలం జూమాకులపల్లికి చెందిన మహిళలు పారిశ్రామిక వాడకు ఆటోలో బయల్దేరారు. గోలాపురం సమీపంలోని నాలుగు రోడ్ల కూడలిలో ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయి ఆటో బోల్తా పడింది. ఆటోలో ప్రయాణిస్తున్న మీనా, సుజాత, నందిని, అరుణ, నాగరాజు, అర్చన, పారిజాతా, బేబీ, అరుణ, స్వల్పంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108లో హిందూపురం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement