జిల్లాకు కొత్త రేషన్‌ కార్డులు | 43,962 ration cards for district | Sakshi
Sakshi News home page

జిల్లాకు కొత్త రేషన్‌ కార్డులు

Jan 1 2017 9:30 PM | Updated on Sep 5 2017 12:08 AM

జిల్లాకు కొత్త రేషన్‌ కార్డులు

జిల్లాకు కొత్త రేషన్‌ కార్డులు

జిల్లాకు 43, 962 కొత్త రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి.

కర్నూలు(అగ్రికల్చర్‌): జిల్లాకు 43, 962 కొత్త రేషన్‌ కార్డులు మంజూరయ్యాయి. వీటిని హైదరాబాద్‌లోని ముద్రించి ఆదివారం మధ్యాహ్నం జిల్లాకు పంపారు. సోమవారం నుంచి జరిగే జన్మభూమి కార్యక్రమంలో వీటిని పంపిణీ చేయనున్నారు. జిల్లాలో లక్షకు పైగా దరఖాస్తులు రాగా  97వేలు మాత్రమే ఈ– పీడీఎస్‌ వెబ్‌సైట్‌లో నమోదు చేశారు. ఇందులో సగం దరఖాస్తులకు కూడా రేషన్‌ కార్డులు రాలేదు. కర్నూలు రెవెన్యూ డివిజన్‌కు 23,558, నంద్యాల రెవెన్యూ డివిజన్‌కు 9,669, ఆదోని డివిజన్‌కు 10,735 ప్రకారం కార్డులు వచ్చాయి. అర్బన్‌ ప్రాంతాల్లో కర్నూలు నగరపాలక సంస్థకు అత్యధికంగా 8,219 కొత్త కార్డులు వచ్చాయి. నంద్యాల మున్సిపాలిటీకి 861, ఆదోని మున్సిపాలిటీకి 34, ఎమ్మిగనూరు మున్సిపాలిటీకి 684, డోన్‌ మున్సిపాలిటీకి 980 ప్రకారం కొత్త కార్డులు వచ్చాయి.
 
   కొత్త కార్డులన్నింటికీ చంద్రన్న సంక్రాంతి కానుకలు పంపిణీ చేస్తారు. రేషన్‌ సరుకులు మాత్రం ఫిబ్రవరి నెల నుంచి ఇస్తారు. అతి తక్కువగా బేతంచెర్ల మండలానికి కేవలం 7 కార్డులు మాత్రమే మంజూరు కావడం గమానార్హం. ఈ మండలంలో 2000 దరఖాస్తులను అప్‌లోడ్‌ చేయగా ఏడుగురికి మాత్రమే మంజూరు కావడం పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. ఇప్పటి వరకు జిల్లాలో తెల్ల రేషన్‌ కార్డులు, అంత్యోదయ అన్నయోజన కార్డులు, అన్నపూర్ణ కార్డులు కలిపి 10,77,528 ఉన్నాయి. కొత్తగా 43,962 రేషన్‌ కార్డులు రావడంతోనే ఈ సంఖ్య 11,12,490కు పెరిగింది. 
 

Advertisement
 
Advertisement
Advertisement