బావిలో పడిన ట్రాక్టర్: నలుగురు మృతి | 4 killed in road accident karimnagar district | Sakshi
Sakshi News home page

బావిలో పడిన ట్రాక్టర్: నలుగురు మృతి

Sep 17 2016 8:47 AM | Updated on Aug 30 2018 4:10 PM

వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న పోలీస్ బైక్‌ను ఢీకొట్టింది.

సైదాపూర్:  వేగంగా వెళ్తున్న ట్రాక్టర్ ఎదురుగా వస్తున్న పోలీస్ బైక్‌ను ఢీకొట్టింది. అనంతరం అదుపుతప్పి పక్కనే ఉన్న బావిలో పడింది. ఈ ప్రమాదంలో నలుగురు యువకులు అక్కడికక్కడే మృతి చెందగా... ఇద్దరు పోలీసులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం దుద్దెనపల్లి శివారులో శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి... చిగురుమామిడి మండలం బొమ్మనపల్లి గ్రామానికి చెందిన కత్తుల శివ (25) ట్రాక్టర్ కొనుగోలు చేశాడు.

ఈ నేపథ్యంలో స్నేహితులు పిల్లి సంతోష్‌కుమార్, బొల్లి రాజు, కొంకట శ్రీకాంత్‌లతో కలిసి సైదాపూర్‌లో శుక్రవారం దావత్ చేసుకొని అర్ధరాత్రి ట్రాక్టర్పై స్వగ్రామానికి తిరుగు ప్రయాణమయ్యారు. ట్రాక్టర్ దుద్దెనపల్లి వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న పోలీస్ బైక్‌ను ఢీకొట్టి... అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న వ్యవసాయ బావిలో పడింది. దీంతో ట్రాక్టర్పై ఉన్న నలుగురు యువకులు నీటిలో మునిగిపోయారు. అలాగే బైక్‌పై ఉన్న పోలీసులకు తీవ్ర గాయాలు కావడంతో వారు అంబులెన్స్‌కు, ఇతర పోలీస్ సిబ్బందికి ఈ ఘటనకు సంబంధించిన సమాచారం అందించారు.

అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని...  క్షతగాత్రులను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. బావిలో పడిన వారి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే అర్ధరాత్రి కావడంతో సహాయక చర్యలకు తీవ్ర అంతరాయం కలిగింది. శనివారం ఉదయం పోలీసులు నలుగురు యువకుల మృతదేహాలను బయటకు తీస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement