30 క్వింటాళ్ల బెల్లం పట్టివేత | 30 quintals jiggery cease | Sakshi
Sakshi News home page

30 క్వింటాళ్ల బెల్లం పట్టివేత

Aug 21 2016 12:31 AM | Updated on Sep 4 2017 10:06 AM

డీసీఎం వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 30 క్వింటా ళ్ల నల్లబెల్లాన్ని ఎక్సైజ్‌ పోలీసులు కురవిలో శనివారం తెల్లవారుజామున స్వాధీ నం చేసుకున్నారు.

కురవి : డీసీఎం వాహనంలో అక్రమంగా రవాణా చేస్తున్న 30 క్వింటా ళ్ల నల్లబెల్లాన్ని ఎక్సైజ్‌ పోలీసులు కురవిలో శనివారం తెల్లవారుజామున స్వాధీ నం చేసుకున్నారు. ఎస్సై రామకృష్ణ కథనం ప్రకా రం.. మానుకోట డీఎస్పీ రాజమహేంద్రనాయక్‌ ఇచ్చిన సమాచారంతో కురవిలోని నేరడ క్రాస్‌రోడ్‌లో తెల్లవారుజామున పోలీసులు వాహనాలను తనిఖీ చేశారు. ఈక్రమంలో ఖమ్మం నుంచి మహబూబాబాద్‌ మండలంలోని మల్యాలకు వెళ్తున్న డీసీఎం వాహనంలో 30 క్వింటాళ్ల నల్లబెల్లం, 50 కేజీల పటికను అక్రమంగా తరలిస్తున్నట్లు గుర్తించి, స్వాధీనం చేసుకున్నారు. వాటిని తరలిస్తున్న వ్యాపారి, మల్యాలకు చెందిన పుల్లూరి నాగేశ్వర్‌రావు, డీసీఎం డ్రైవర్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని అనంతపురం జిల్లా గుత్తి మండల కేంద్రానికి చెందిన నిసార్‌ అహ్మద్‌లను అరెస్టు చేశారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement