హైదరాబాద్‌ పబ్బులపై దాడులు.. నలుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌ | Excise Police Raids On Pubs In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ పబ్బులపై దాడులు.. నలుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌

Sep 7 2024 10:32 AM | Updated on Sep 7 2024 1:58 PM

Excise Police Raids On Pubs In Hyderabad

హైదరాబాద్‌ పబ్బులపై ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. టెస్టులో నలుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌గా తేలింది.

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో పబ్బులపై ఎక్సైజ్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. టెస్టులో నలుగురికి డ్రగ్స్‌ పాజిటివ్‌గా తేలింది. ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ వీబీ కమలాసన్ రెడ్డి ఆదేశాల మేరకు ఎక్సైజ్‌ జాయింట్‌ కమిషనర్‌ ఖురేషి నేతృత్వంలో తనిఖీలు చేపట్టారు. శుక్రవారం అర్ధరాత్రి వరకు ఐదు పబ్బుల్లో తనిఖీలు నిర్వహించాగా, 33 మందికి డ్రగ్ డిటెక్షన్ కిట్స్‌తో శాంపిల్స్ సేకరించారు.

పాజిటివ్ వచ్చిన వారిలో వరంగల్ కు చెందిన చిన్న నిగేష్, శ్రీకాకుళం కి చెందిన నార్త్ రవికుమార్, మూసాపేటకు చెందిన టీవీఎస్ కేశవరావు, చార్మినార్ కు చెందిన అబ్దుల్ రహీమ్ లకు డ్రగ్స్ పాజిటివ్ వచ్చింది. కోరం క్లబ్‌లో ఇద్దరికి, బేబిలోన్‌ పబ్‌లో ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. చిన్న నిగేష్‌(వరంగల్‌), నార్త్‌ రవికుమార్‌(శ్రీకాకుళం), కేశవరావు(మూసేపేట), చార్మినార్‌కు చెందిన రహీమ్‌లకు పాజిటివ్‌గా గుర్తించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement