దీక్షలు విరమించండి
రెండో ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని డీఎంహెచ్‌వో వెంకట్ తెలిపారు.
-
ప్రభుత్వం సమస్యలు పరిష్కరిస్తుంది
-
డీఎంహెచ్‌వో వెంకట్
వినాయక్‌నగర్ : రెండో ఏఎన్‌ఎంల సమస్యలు పరిష్కరించడానికి ప్రభుత్వం సుముఖంగా ఉందని డీఎంహెచ్‌వో వెంకట్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ధర్నాచౌక్‌లో రెండో ఏఎన్‌ఎంలు చేపట్టిన దీక్షలు సోమవారానికి పదిహేను రోజులకు చేరాయి. సోమవారం ఆయన దీక్షా శిబిరాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించడానికి సర్కారు సానుకూలంగా ఉన్నందున దీక్షలు విరమించి, విధుల్లో చేరాలని సూచించారు. అయినా వారు వినకుండా ఎన్టీఆర్ చౌక్‌లో మానవహారం చేపట్టారు.
ఈ సందర్భంగా యునైటెడ్ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ గౌరవ అధ్యక్షుడు రమేశ్‌బాబు మాట్లాడుతూ రెండో ఏఎన్‌ఎంలకు కనీస వేతనం రూ. 21,300 ఇవ్వాలని, సబ్ సెంటర్ అద్దె, టీఏ, డీఏ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వేణుగోపాల్, సంజూ జార్జ్, శ్రామిక మహిళా సంఘం జిల్లా అధ్యక్షురాలు నూర్జహాన్, సీపీఎం నాయకులు గోవర్ధన్, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.