122 మంది మావోయిస్టుల లొంగుబాటు | 122 Maoists surrender | Sakshi
Sakshi News home page

122 మంది మావోయిస్టుల లొంగుబాటు

Apr 9 2016 10:22 PM | Updated on Oct 9 2018 2:51 PM

122 మంది మావోయిస్టుల లొంగుబాటు - Sakshi

122 మంది మావోయిస్టుల లొంగుబాటు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శనివారం 122 మంది మావోయిస్టులు, వారి సానుభూతిపరులు బస్తర్.......

చింతూరు (తూర్పుగోదావరి): ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం సుక్మా జిల్లాలో శనివారం 122 మంది మావోయిస్టులు, వారి సానుభూతిపరులు బస్తర్ రేంజ్ ఐజీ ఎస్సార్పీ కల్లూరి, కలెక్టర్ నీరజ్ బన్సోడ్ ఎదుట లొంగిపోయారు.

లొంగిపోయిన వారిలో జన్ మిలిషీయా కమాండర్లు, లోకల్ ఆపరేషన్ స్క్వాడ్ (ఎల్‌వోఎస్) సభ్యులు, చేతన నాట్యమండలి సభ్యులు, జన్ మిలీషియా సభ్యులు ఉన్నట్లు ఐజీ తెలిపారు. వీరిలో 8 మంది మహిళా మావోయిస్టులు కూడా ఉన్నారని, చాలామందిపై రివార్డులు ఉన్నాయని ఆయన తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement