ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలకు ‘12 బి’ గుర్తింపు | '12 B 'identity | Sakshi
Sakshi News home page

ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలకు ‘12 బి’ గుర్తింపు

Sep 28 2016 11:36 PM | Updated on Mar 21 2019 9:05 PM

బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలకు బుధవారం యూజీసీ 12 బి గుర్తింపు లభించిందని ప్రిన్సిపాల్‌ రామాసుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలలో

బాన్సువాడ టౌన్‌ : 
బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలకు బుధవారం యూజీసీ 12 బి గుర్తింపు లభించిందని ప్రిన్సిపాల్‌ రామాసుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కళాశాలకు ఈ గుర్తింపు లభించడంతో కేంద్ర ప్రభుత్వ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) ద్వారా కళాశాలలో అభివృద్ధి పనుల కోసం యూజీసీ నిధులు కేటాయిస్తారని పేర్కొన్నారు. యూజీసీ గ్రాంట్స్‌ మంజూరు కావాలంటే 12బి గుర్తింపు అవసరముంటుందని, మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి సహకారంతో బాన్సువాడ ఎస్‌ఆర్‌ఎన్‌కే డిగ్రీ కళాశాలకు గుర్తింపు వచ్చిందని తెలిపారు. కళాశాల అభివృద్ధికి, వేతనాలకు కేంద్రం నుంచి 80 శాతం నిధులు సమకూరిస్తే, రాష్ట్ర ప్రభుత్వం 20 శాతం నిధులను కేటాయిస్తుందన్నారు. కళాశాలలో 29న ఏలాన్‌–2016 కార్యక్రమం నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి రానున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో వైస్‌ ప్రిన్సిపాల్‌ గంగాధర్, అధ్యాపకులు రవిరాజ్, ఉపేంద్ర, శంకర్‌రావు, విఠల్, గోపాల్, అంబర్‌సింగ్, వెంకటరమణ, అశోక్‌ తదితరులు పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement