సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో ఓ 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది.
సారంగపూర్ మండలం పెంబట్ల గ్రామంలో ఓ 10 ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగింది. గ్రామానికి చెందిన కె.రవి(22) అనే యువకుడు తల్లిదండ్రులు లేని సమయం చూసి బాలిక పై అత్యాచారం చేశాడు. సోమవారం రాత్రి కడుపులో నొప్పి వస్తుందని బాలిక తన తల్లిదండ్రులకు చెప్పడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. వైద్యులు పరీక్షించి చూడటంతో విషయం బయటపడింది. మంగళవారం బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.