అట్లాంటాలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు | YSR birth anniversary celebrated in atlanta | Sakshi
Sakshi News home page

అట్లాంటాలో వైఎస్ఆర్ జయంతి వేడుకలు

Jul 19 2016 7:43 PM | Updated on Jul 7 2018 3:19 PM

మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి 67వ జయంతి వేడుకలు అమెరికాలోని అట్లాంటా నగరంలో ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు.

అట్లాంటా: మహానేత వైఎస్. రాజశేఖర రెడ్డి 67వ జయంతి వేడుకలు అమెరికాలోని అట్లాంటా నగరంలో ఎన్నారైలు ఘనంగా నిర్వహించారు. జులై 17వ తేదీ ఆదివారం అభిమానులు, బంధుమిత్రాదుల సమక్షంలో జరిగాయి.  ముఖ్య అతిథిగా హాజరైన వైఎస్ ప్రకాష్ రెడ్డి ఈ సందర్భంగా వైఎస్ఆర్ గురించి తమ అనుభవాలు పంచుకున్నారు. అలాగే తెలుగు ప్రజలకు వైఎస్ రాజశేఖరరెడ్డి చేసిన సేవలు, పేదల పట్ల ఆయన కనబరిచిన ప్రత్యేక శ్రద్ధను ప్రస్తావిస్తూ కృష్ణా రెడ్డి (రిటైర్డ్ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్),  ప్రసాద్ రెడ్డి , వి. గురివిరెడ్డి, బాల రెడ్డి ఇందుర్తి  తదితరులు ప్రసంగించారు.

మూడు గంటల పాటు జరిగిన ఈ కార్యక్రమంలో ముందుగా మహానేత చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా అంజలి ఘటనించారు.  కార్యక్రమ నిర్వాహకులు  వైస్సార్సీపీ (అమెరికా) కన్వీనర్ గురువారెడ్డి , నంద గోపినాథ్ రెడ్డి,వెంకట్రామ్ చింతం  ,శ్రీనివాసులరెడ్డి కొట్లూరు ,నరేష్ గువ్వా, శ్రీని వంగిమళ్ళ, కల్వకుర్తి ఉమా మహేశ్వర రెడ్డి ,ప్రసాద్ రెడ్డి, దామోదర్ రెడ్డి, చంద్రా, జగదీష్, విజయ్ కోట,లక్ష్మీ  ఛారుగుంట వైఎస్ఆర్ జయంతికి హాజరైన వారందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement