తాజ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు | Sakshi
Sakshi News home page

తాజ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

Published Sun, Sep 4 2016 8:46 AM

తాజ్ ఆధ్వర్యంలో తెలుగు భాషా దినోత్సవ వేడుకలు

సౌదీ అరేబియాలోని జెద్దా నగరంలో ప్రవాసీ తెలుగు సంఘమైన తాజ్ (తెలుగు అసోసియెషన్ ఆఫ్ జెద్దా) ఆధ్వర్యంలో శుక్రవారం తెలుగు భాషా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న తెలుగు ప్రవాసీయులను అభినందిస్తూ పురస్కరించారు. తెలుగు భాష వ్యాప్తి కొరకు ప్రవాసీయులకు సాఫ్ట్వేర్ను ఉచింతగా అందించిన ఎలక్ట్రికల్ ఇంజినీర్ సయీదోద్దీన్‌ను ఈ కార్యక్రమంలో సన్మానించారు. అక్కడి పాఠశాలలో చదువుతున్న తెలుగు రాష్ట్రాల విద్యార్ధుల కొరకు తెలుగు భాషను ప్రవేశపెట్టడానికి కృషి చేసిన వారిని కూడ ఈ సందర్భంగా తాజ్ సత్కరించింది.

సౌదీ అరేబియాలో తెలుగు భాష వ్యాప్తి కొరకు తాజ్ చేస్తున్న ప్రయత్నాలను అధ్యక్షుడు మోహమ్మద్ యూసుఫ్ వివరించారు. కుల, మత మరియు ప్రాంతీయ విభేదాలకు అతీతంగా తెలుగు ప్రవాసీయుల కొరకు తాజ్ కృషి చేస్తున్నదని ప్రధాన కార్యదర్శి మేడికొండు భాస్కర్ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వహీద్, శ్రీ లక్ష్మిలు పాడిన గేయాలు అలరించాయి. చిన్నారి సాయి దీక్షిత సాంప్రదాయ నృత్యం, తెలుగు ప్రముఖులను అనుకరిస్తూ చిన్నారుల వేషధారణలు సభికులను ఆకట్టుకున్నాయి.


 

Advertisement
 
Advertisement
 
Advertisement