తెలుగువారి సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి ఉత్సవాలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు.
డల్లాస్: తెలుగువారి సంస్కృతీ, సాంప్రదాయాలను ప్రతిబింబించేలా సంక్రాంతి ఉత్సవాలను అమెరికాలో ఘనంగా నిర్వహించారు. టాంటెక్స్ సంస్థ ఆద్వర్యంలో జరిగిన ఈ సంబరాల్లో డల్లాస్ ప్రాంతంలో ఉన్నటువంటి తెలుగువారు పాల్గొని తమ మాతృభూమి అనుభూతులను నెమరువేసుకున్నారు. శనివారం జరిగిన ఈ ఉత్సవాల్లో రంగవల్లులు, గొబ్బెమ్మలతో పల్లెటూరు వాతావరణాన్ని గుర్తుచేసుకొని ఆనందోత్సాహాలతో గడిపారు.
ఆర్.జే ప్రణవి ఈ కార్యక్రమానికి ప్రధాన వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో ఉత్తరటెక్సాస్ తెలుగుసంఘం (టాంటెక్స్) అధ్యక్షులు సుబ్రహ్మణ్యం జొన్నలగడ్డ, కార్యక్రమసమన్వయకర్త రఘు గజ్జల, టెంటెక్స్ పూర్వాధ్యక్షులు డా. ఊరిమిండి నరసింహారెడ్డితో పాటూ అజయ్ రెడ్డి, డా.రాఘవ రెడ్డి, లోకేష్ నాయుడు, శేఖర్ బ్రహ్మదేవర, ఉమామహేష్ పార్నపల్లి, పద్మశ్రీ తోట, శారద సింగిరెడ్డి, సునీల్ దేవిరెడ్డి, నీరజ పడిగెల, శశి కనపర్తి, మిమిక్రి రమేష్లు పాల్గొన్నారు.