వైభవంగా టాటా ద్వితీయ వార్షికోత్సవాలు | T.A.T.A 2nd anniversary a huge success | Sakshi
Sakshi News home page

వైభవంగా టాటా ద్వితీయ వార్షికోత్సవాలు

May 2 2017 4:15 PM | Updated on Sep 5 2017 10:13 AM

తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం(టాటా) ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు డల్లాస్ లో వైభవంగా జరిగాయి.



- డల్లాస్‌లో రెండు రోజుల పాటు అలరించిన వేడుకలు

- నటి భానుప్రియకు టాటా జీవిత సాఫల్య పురస్కారం
- 2018-ఫిలడెల్ఫియా సభలకు చేతులు కలిపిన ఆటా,నాటా,టాటా
 
డల్లాస్: తెలంగాణా అమెరికన్ తెలుగు సంఘం(టాటా) ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. డల్లాస్ సమీప ఫ్రిస్కోలోని డాక్టర్ పెప్పర్ ఎరీనాలో శుక్ర, శనివారాల్లో నిర్వహించిన ఈ వేడుకలో 6వేల మందికిపైగా అతిథులు పాల్గొన్నారు. టాటా కార్యదర్శి విక్రమ్ జంగం , కోశాధికారి ఆదిభట్ల మహేష్‌లు స్వాగతోపన్యాసం ఇచ్చారు. సినీనటులు నిఖిల్, స్వాతి, దేవరకొండ విజయ్, మధుశాలిని, యాంకర్ రవి, ఎంసీ మధు తదితర సెలబ్రిటీలతోపాటు స్థానిక ప్రవాస యువతీయువకులు ప్రదర్శించిన నృత్యాలు సభికులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
 
భానుప్రియకు పురస్కారం: అమెరికా కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి, సౌత్‌లేక్ నగర మేయర్ లారా హిల్స్, తెలంగాణ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ తదితర ప్రముఖులు వేడుకలో పాల్గొని టాటాకు శుభాకాంక్షలు తెలిపారు. టాటా సలహా సంఘ అధ్యక్షుడు డా.పైళ్ల మల్లారెడ్డి, టాటా అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి, నాటా వ్యవ్యాస్థాపకులు డా.ప్రేంరెడ్డిలు సినీనటి భానుప్రియకు జీవన సాఫల్య పురస్కారాన్ని అందించారు. ఆటా, నాటా, టీప్యాడ్, టాంటెక్స్ తదితర సంస్థల ప్రతినిధులు టాటాకు అభినందనలు తెలిపారు.  
 
ఈ సందర్భంగా మాట్లాడిన టాటా అధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి  సేవా కార్యక్రమాల్లో ప్రవాసులు విరివిగా పాల్గొనాలని కోరారు. 'టాటా ముచ్చట' పేరుతో గూడూరి శ్రీనివాస్ నేతృత్వంలో రూపొందించిన టాటా మాస పత్రికను ఆవిష్కరించారు. జానపద సోదరులు మానప్రగడ శ్రీనివాస్, మానప్రగడ సాయి, సినీగాయకులు హేమచంద్ర, శ్రవణభార్గవి, మిమిక్రీ రమేష్ తదితరులు తమ ప్రతిభతో ప్రవాసులను ఆకట్టుకున్నారు.
 
చేతులు కలిపిన సంఘాలు
ఫిలడెల్ఫియాలో 2018లో నిర్వహించనున్న సభలను ఆటా-నాటా-టాటాలు సంయుక్తంగా నిర్వహించనున్నాయి. ఈ మేరకు టాటా ద్వైవార్షిక సభలో.. ఆటా వ్యవస్థాపకుడు హనుమంతరెడ్డి, నాటా వ్యవస్థాపకుడు డా.ప్రేంరెడ్డి, టాటా వ్యవస్థాపకుడు డా.పైళ్ల మల్లారెడ్డిలు చేసిన ప్రకటనకు ప్రవాసులు తమ హార్షాతిరేకాలు తెలిపారు. 
 
ఈ వేడుకల్లో టాటా సంస్థ ప్రతినిధులు డా.హరినాథ్ పొలిచెర్ల, పట్లోల్ల మోహన్, విజయపాల్ రెడ్డి, అనుగు శ్రీనివాస్, మదాడి భరత్, తాడేపల్లి ఫణిభుషణ్, అనీల్ ఎర్రబెల్లి, గోలి గౌతం, సంజీవ్ రెడ్డి, మహేందర్ కామిరెడ్డి, జగదీష్ బొందుగుల, మాధవ ఉప్పుగల్ల, మల్లాది రాంరెడ్డి, జ్యోతి రెడ్డి, శేరి విజయ్, కోలన్ మధు, నాగులగారి రవీందర్, ఆవుల శ్రీనివాస్, వంశీ రెడ్డి, వేముగంటి శరత్, మెతుకు నరేందర్, మలిపెద్ది నవీన్, తంగెళ్లపల్లి రమేష్, ఈశ్వర్ రెడ్డి బండ, ఆటా నుంచి అధ్యక్షుడు కరుణాకర్ అసిరెడ్డి, నాటా నుండి గంగసాని రాజేశ్వరరెడ్డి, గోశాల రాఘవరెడ్డి, కొర్సపాటి శ్రీధర్ రెడ్డి, ఆటా నుండి గవ్వా సంధ్యా, భీంరెడ్డి పరమేష్, కొండపల్లి సౌమ్య, అజయ్ రెడ్డి, ముప్పిడి అరవింద్, సతీష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement