యూఎస్లో తెలుగు విద్యార్థి దారుణ హత్య | sankirt killed in usa | Sakshi
Sakshi News home page

యూఎస్లో తెలుగు విద్యార్థి దారుణ హత్య

Jul 19 2016 5:27 PM | Updated on Aug 24 2018 8:18 PM

యూఎస్లో తెలుగు విద్యార్థి దారుణ హత్య - Sakshi

యూఎస్లో తెలుగు విద్యార్థి దారుణ హత్య

అమెరికాలో తెలుగు విద్యార్థి సంకీర్త్ మంగళవారం దారుణ హత్యకు గురైయ్యాడు.

న్యూయార్క్ : అమెరికాలో తెలుగు విద్యార్థి సంకీర్త్ మంగళవారం దారుణ హత్యకు గురైయ్యాడు. అతడిని రూమ్మేట్ సాయి సందీప్ కత్తిలో పొడిచి హత్య చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతడిని పోలీస్ స్టేషన్కు తరలించారు. సాయి సందీప్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

నిన్న మధ్యాహ్నం రూమ్లో సంకీర్త్, సాయి సందీప్ ఘర్షణ పడినట్లు పోలీసుల  విచారణలో వెల్లడి అయింది. హైదరాబాద్ సుల్తాన్ బజార్ కు చెందిన సంకీర్త్ ఉన్నత విద్య కోసం రెండేళ్ల క్రితం అమెరికాకు వెళ్లాడు. అతడి మృతదేహన్ని పోలీసులు పోస్ట్ మార్టం నిర్వహించేందుకు ఆసుపత్రికి తరలించారు. సంకీర్త్ మరణ వార్త విన్న వారి కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement