ఆస్ట్రేలియాలో భారతీయుడిపై దాడి | One arrested for attack on Indian student in Australia | Sakshi
Sakshi News home page

ఆస్ట్రేలియాలో భారతీయుడిపై దాడి

Dec 31 2013 11:09 AM | Updated on Sep 2 2017 2:09 AM

భారతీయ విద్యార్థి మనిరిజ్విందర్ సింగ్ పై దాడి కేసులో అనుమానితుడిని అస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేశారు.

భారతీయ విద్యార్థి మనిరిజ్విందర్ సింగ్(20) పై దాడి కేసులో ఓ అనుమానితుడిని అస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేసినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. అనుమానితుడిని జ్యుడిషియల్ రిమాండ్కు తరలించేందుకు స్థానిక పోలీసు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు.

 

దాడితో ఆపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగ్ పరిస్థితిని ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తుందని చెప్పారు. మరో ఇద్దరు అనుమానితులను గుర్తించినట్లు వారిని కూడా అరెస్ట్ చేసేందుకు ఆస్ట్రేలియా పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం తమకు వివరించిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు.



మెల్బోర్న్లోని బిర్రాంగ్ మర్ పార్క్ సమీపంలోని ప్రిన్సెస్ బ్రిడ్జ్ వద్ద కూర్చుని ఇద్దరు స్నేహితులతో సంభాషిస్తున్న మనిరిజ్విందర్ సింగ్పై  ఎనిమిది మంది సభ్యుల బృందం దాడి చేసింది. ఆ ఘటనలో సింగ్తో పాటు అతని స్నేహితుడు గాయపడ్డారు. అయితే ఆ దాడిలో సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో సింగ్ను అతడి స్నేహితులు స్థానిక అల్ఫ్రెడ్ ఆసుపత్రికి తరలించారు.

 

అప్పటికే సింగ్ ఆపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అయితే భారతీయుడిపై దాడిని ఆస్ట్రేలియా ఖండించింది. నిందితులు వదిలి పెట్టే ప్రసక్తే లేదని ప్రకటించింది. అయితే భారతీయుడిపై దాడి చేసిన ఎనిమిది మంది బృందంలో మహిళ కూడా ఉండటం గమనార్హం. గాయపడిన మనిరిజ్వేందర్ సింగ్ మెల్బోర్న్ యూనివర్శిటీలో బి.కామ్ చదువుతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement