breaking news
Melbourne university
-
ఈతకు వెళ్లి.. ఎన్నారై విద్యార్థి మృతి
స్నేహితులతో సరదాగా ఈతకు వెళ్లిన తెలుగు విద్యార్థి మృతి చెందాడు. విశాఖపట్నానికి చెందిన అనుదీప్ ఎంఎస్ చేసేందుకు ఆస్ట్రేలియాలోని మెల్బోర్న్ యూనివర్సిటీలో సీటు సంపాదించి ఈ సంవత్సరం మార్చిలో ఆస్ట్రేలియా వెళ్లాడు. బుధవారం సాయంత్రం స్నేహితులతో కలిసి మెల్బోర్న్లోని ఒక చెరువులో ఈతకు వెళ్లాడు. అయితే.. ప్రస్తుతం అక్కడ ఉష్ణోగ్రత మైనస్ డిగ్రీలలో ఉంటోంది. ఆ విషయం గుర్తించలేని అనుదీప్.. అలాగే చెరువులో ఈతకు దిగాడు. దాంతో అక్కడున్న మంచుగడ్డల్లో ఇరుక్కుపోయి మరణించాడు. ఈ విషయాన్ని విశాఖపట్నంలో ఉంటున్న అతడి కుటుంబ సభ్యులకు గురువారం తెల్లవారుజామున చెప్పారు. అతడి తండ్రి నేవీలో ఉద్యోగం చేస్తున్నారు. కుమారుడి మరణవార్త విని తల్లిదండ్రులు హతాశులయ్యారు. -
ఆస్ట్రేలియాలో భారతీయుడిపై దాడి
భారతీయ విద్యార్థి మనిరిజ్విందర్ సింగ్(20) పై దాడి కేసులో ఓ అనుమానితుడిని అస్ట్రేలియా పోలీసులు అరెస్ట్ చేసినట్లు భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి మంగళవారం న్యూఢిల్లీలో వెల్లడించారు. అనుమానితుడిని జ్యుడిషియల్ రిమాండ్‌కు తరలించేందుకు స్థానిక పోలీసు అధికారులు చర్యలు చేపట్టినట్లు తెలిపారు. దాడితో ఆపస్మారక స్థితిలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సింగ్ పరిస్థితిని ఆస్ట్రేలియాలోని భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తుందని చెప్పారు. మరో ఇద్దరు అనుమానితులను గుర్తించినట్లు వారిని కూడా అరెస్ట్ చేసేందుకు ఆస్ట్రేలియా పోలీసులు రంగం సిద్ధం చేసినట్లు ఆ దేశంలోని భారత రాయబార కార్యాలయం తమకు వివరించిందని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి పేర్కొన్నారు. మెల్బోర్న్లోని బిర్రాంగ్ మర్ పార్క్ సమీపంలోని ప్రిన్సెస్ బ్రిడ్జ్ వద్ద కూర్చుని ఇద్దరు స్నేహితులతో సంభాషిస్తున్న మనిరిజ్విందర్ సింగ్‌పై ఎనిమిది మంది సభ్యుల బృందం దాడి చేసింది. ఆ ఘటనలో సింగ్‌తో పాటు అతని స్నేహితుడు గాయపడ్డారు. అయితే ఆ దాడిలో సింగ్ తీవ్రంగా గాయపడ్డారు. దాంతో సింగ్‌ను అతడి స్నేహితులు స్థానిక అల్ఫ్రెడ్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే సింగ్ ఆపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. అయితే భారతీయుడిపై దాడిని ఆస్ట్రేలియా ఖండించింది. నిందితులు వదిలి పెట్టే ప్రసక్తే లేదని ప్రకటించింది. అయితే భారతీయుడిపై దాడి చేసిన ఎనిమిది మంది బృందంలో మహిళ కూడా ఉండటం గమనార్హం. గాయపడిన మనిరిజ్వేందర్ సింగ్ మెల్బోర్న్ యూనివర్శిటీలో బి.కామ్ చదువుతున్నాడు.