చిన్నారిపై అసభ్య ప్రవర్తన... నిందితుడికి జైలు శిక్ష
దుబాయిలో ఉద్యోగం కోసం వెళ్లి... ఏడేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు ఓ భారతీయుడు. దాంతో సదరు భారతీయుడు దుబాయి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది.
దుబాయిలో ఉద్యోగం కోసం వెళ్లి... ఏడేళ్ల బాలికపై అసభ్యంగా ప్రవర్తించాడు ఓ భారతీయుడు. దాంతో సదరు భారతీయుడు దుబాయి కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది... శిక్ష ముగిసిన వెంటనే దేశం విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ మేరకు స్థానిక మీడియా ఆదివారం వెల్లడించింది. ఉద్యోగం కోసం దుబాయి వెళ్లిన భారతీయుడు అక్కడ హోటల్లో క్లీనర్గా పని చేస్తున్నాడు. ఆ క్రమంలో గతేడాది డిసెంబర్ ఓ తల్లి తన ఏడేళ్ల కుమార్తెతో కలసి హోటల్కు వచ్చింది.
అక్కడ అల్పాహారం తీసుకున్న అనంతరం కౌంటర్లో నగదు చెల్లించేందుకు వెళ్లింది. అక్కడ చిల్లర లేకపోవడం కుమార్తెను హోటల్లో ఉంచి తల్లి చిల్లర తెచ్చేందుకు బయటకు వెళ్లింది. చిల్లర తీసుకువచ్చిన తల్లికి కుమార్తె దుఃఖిస్తుండటంతో ఏమైందని ఆరా తీసింది. జరిగిన విషయాన్ని కుమార్తె తల్లికి వివరించింది. దాంతో బాలిక తల్లి హోటల్ క్లీనర్పై పోలీసులుకు ఫిర్యాదు చేసింది. భారతీయుడిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అందులోభాగంగా భారతీయుడిపై నమోదైన అభియోగాలు నిజమని తెలడంతో దుబాయ్ కోర్టు భారతీయుడికి శిక్ష విధించింది.


