షాకింగ్‌: పార్కుల్లో అమ్మాయిలను చూసి.. 

youth accused of Molesting girls in parks arrested - Sakshi

నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు 

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మహిళలపై వేధింపులకు అడ్డే లేకుండాపోయింది. హస్తినలో మహిళలు నిత్యం ఎక్కడో చోట లైంగిక వేధింపులకు, అసభ్య చర్యలకు గురవుతూనే ఉన్నారు. తాజాగా పార్కులో అమ్మాయిలను చూడగానే.. బహిరంగంగా లైంగిక అసభ్య చర్యలకు పాల్పడుతున్న ఓ కీచకుడిని పోలీసులు అరెస్టు చేశారు.

దక్షిణ ఢిల్లీలోని పలు విలాసవంతమైన ప్రాంతాల్లో ఉన్న పార్కుల్లో అమ్మాయిలను చూడగానే నిందితుడు బహిరంగంగా లైంగిక స్వయం సంతృప్తి చర్యలకు పాల్పడేవాడు. తాజాగా చిత్తరంజన్‌ పార్కులో వాకింగ్‌కు వెళ్లిన ముగ్గురు అమ్మాయిలకు ఇదే షాకింగ్‌ అనుభవం ఎదురైంది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదకొండు రోజులు గాలించిన పోలీసులు.. అమ్మాయిలు ఇచ్చిన వివరాల ఆధారంగా నిందితుడిని గుర్తించారు. అతడి పేరు మిథున్‌ బెనర్జీ. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాల జిల్లాకు చెందిన అతడు గత రెండేళ్లుగా ఢిల్లీలోని గోవింద్‌పురిలో నివాసముంటున్నాడు. స్టెపంబర్‌ 5వ తేదీన పార్కులో వాకింగ్‌ చేస్తున్న ముగ్గురు అమ్మాయిలను చూసి.. నిందితుడు బహిరంగంగా లైంగిక అసభ్య చర్యలకు పాల్పడ్డాడు. అంతేకాదు, అతడు గతంలో అలకనంద, గ్రేటర్‌ కైలాశ్‌ పార్కుల్లోనూ ఇదే విధంగా అమ్మాయిలు ఎదురుగా అసభ్య చర్యలకు దిగాడు. నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు అతని ఫోన్‌లో అశ్లీల వీడియోలు ఉన్నట్టు గుర్తించారు.
చదవండి: యువతి ఎదుట ఆటోడ్రైవర్‌ లైంగిక అసభ్య చర్య!
 

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top