పెళ్లి ఇష్టం లేదని.. వరుడు ఆత్మహత్య  

Young Man Commits Suicide Before Marriage In Nalgonda District - Sakshi

గంటలో పెళ్లి.. పరారై ఆత్మహత్య   

యువతికి మరో యువకుడితో వివాహం

చందంపేట మండలంలో ఆలస్యంగా వెలుగులోకి

చందంపేట (దేవరకొండ) : ఆ ఇళ్లంతా పెళ్లి వేడుకలో మునిగి ఉంది... బంధువుల సందడి.. పెళ్లి కూతురిని అలంకరించి పెళ్లిపీటలపైకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు... అంతలోనే అనుకోని వార్త... పెళ్లి ఇష్టం లేని వరుడు పరారయ్యాడని... మరో గంటలో పెళ్లి కుమార్తె మెడలో తాళ్లి కట్టాల్సిన వరుడు రావడం లేదన్న వార్తతో ఆ పెళ్లి వేడుకలో స్తబ్దత నెలకొంది. అంతా సిద్ధమైన తరుణంలో పెళ్లి నిలిచిపోతుందని కంగారు... ఏం చేయాలో పాలుపోని స్థితిలో అక్కడే ఉన్న ఓ యువకుడితో పెళ్లి తంతు జరిపించారు. తీరా పారిపోయిన వరుడు ఆత్మహత్య చేసుకున్నాడు. నల్లగొండ జిల్లా చందంపేట మండలంలోని తెల్దేవర్‌పల్లి గ్రామ శివారులోని మోత్యతండాలో శని వారం జరగగా, ఆదివారం వెలుగులోకి వచ్చిం ది.

గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. తెల్దేవర్‌పల్లి గ్రామానికి చెందిన దశరథం, తారి దంపతుల కుమార్తె లక్ష్మికి చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామానికి చెం దిన హరిలాల్‌తో ఈనెల 12న వివాహం జరిపేం దుకు పెద్దలు నిర్ణయించారు. అయితే తనకు పెళ్లి ఇష్టం లేదని హరిలాల్‌(24) తన తల్లిదండ్రులతో చెప్పాడు. కాని హరిలాల్‌ తల్లిదండ్రులు మాత్రం బలవంతంగానైనా పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. పెళ్లి తరుణం రానే వచ్చింది. మోత్యతండాలో పెళ్లికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు అన్ని జరిగిపోయాయి. పెళ్లి గడియలు సమీపిస్తున్నా వరుడి తరఫు వారు రాకపోవడంతో ఫోన్‌లో సంప్రదించగా పెళ్లి కుమారుడు పరారయ్యాడని సమాచారం అందింది. దీంతో ఏం చేయాలో పాలుపోని అక్కడి పెద్దలు అక్కడే ఉన్న ఓ యువకుడికి లక్ష్మిని ఇచ్చి వివాహం చేశారు. ఇదిలా ఉండగా పరారైన పెళ్లికుమారుడు హరిలాల్‌ దేవరకొండ శివారులో క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. 
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top