మోదీ మార్ఫింగ్‌ చిత్రం యువకుడు అరెస్ట్‌

Young Man Arrest In Modi Marfing Photo Upload In Facebook - Sakshi

తమిళనాడు, టీ.నగర్‌: ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసి చిత్రించిన యువకుడిని తిరుపూర్‌లో పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. తిరుపూర్‌ ఉత్తర జిల్లా బీజేపీ నేత చిన్నస్వామి ఈనెల రెండో తేదీన తిరుపూర్‌ నార్త్‌ పోలీసుస్టేషన్‌లో ఒక ఫిర్యాదు చేశారు. అందులో ప్రభాకరన్‌ అనే యువకుడు తన ఫేస్‌బుక్‌లో ప్రధాని మోదీ చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసి విడుదల చేశారని అతనిపై చర్యలు తీసుకోవాల్సిందిగా కోరారు.

దీనిపై సీఐ పిచ్చయ్య ఆధ్వర్యంలోని పోలీసులు విచారణ జరుపుతూ వచ్చారు. ఇలావుండగా ఫేస్‌బుక్‌లో మోదీ చిత్రాన్ని మార్ఫింగ్‌ చేసిన ప్రభాకరన్‌ (23) అని, అతను తిరుపూర్‌ ఎస్‌వీ కాలనీలో నివశిస్తున్నట్లు, ఒక అద్దకపు పరిశ్రమలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్నట్లు తెలిసింది. ఇతని సొంతవూరు సేలం జిల్లా ఆత్తూరు తాలూకా వలయమాదేవి గ్రామానికి చెందిన వ్యక్తిగా కనుగొన్నారు. అతన్ని పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top