మహిళ ఆత్మహత్య | Women Suicide In YSR Kadapa | Sakshi
Sakshi News home page

మహిళ ఆత్మహత్య

Aug 21 2018 7:52 AM | Updated on Aug 21 2018 7:52 AM

Women Suicide In YSR Kadapa - Sakshi

మృతి చెందిన కృష్ణవేణి

రాయచోటి టౌన్‌(వైఎస్సార్‌ కడప) : రాయచోటి పట్టణ పరిధిలోని కొత్తపేట రాజు బుక్‌స్టాల్‌ సమీపంలో నివాసం ఉంటున్న బొంగాని జనార్ధన్‌ భార్య కృష్ణవేణి (40) ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. బంధువులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కుమార్తె విష్ణుప్రియ తలకు పేలు నివారణ మందు పెట్టే విషయమై భార్యభర్తలు గొడవ పడ్డారు. ఈ విషయమై ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలో సోమవారం తెల్లవారుజామున భర్త ఇంటిలో సమయంలో ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

తెల్లవారిన తరువాత ఇంటిలోని వారు గుర్తించి ఫ్యాన్‌ నుంచి వేరు చేసి చూడగా అప్పటికే మృతి చెందింది. అయితే ఈ విషయాన్ని గోప్యంగా ఉంచారు. ఇరుగు పొరుగు వారి ద్వారా సమాచారం తెలుసుకున్న పోలీసులు సాయంత్రం వెళ్లి విచారణ చేపట్టారు. మృతురాలి తమ్ముడు చేసిన ఫిర్యాదు మేరకు.. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసినట్లు అర్బన్‌ ఎస్‌ఐ సీఐ మహేశ్వరరెడ్డి తెలిపారు. దర్యాప్తు చేసి నిజాలు నిగ్గుతేలుస్తామని ఆయన పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement