బిడ్డను బావిలో తోసి.. తల్లి ఆత్మహత్య | Women Suicide Attempt In Warangal | Sakshi
Sakshi News home page

బిడ్డను బావిలో తోసి.. తల్లి ఆత్మహత్య

May 19 2019 10:36 AM | Updated on May 19 2019 10:36 AM

Women Suicide Attempt In Warangal - Sakshi

తల్లీబిడ్డల మృతదేహాలు 

నెక్కొండ: భార్యాభర్తల మధ్య ఆర్థిక పరమైన గొడవలు తల్లీకూతుర్ల మృతికి దారితీసిన సంఘటన వరంగల్‌ రూరల్‌ జిల్లా నెక్కొండలో శనివారం చోటుచేసుకుంది. నెక్కొండ మండలం సూరిపల్లికి చెందిన మంగ రమేష్‌కు పర్వతగిరి మండలం గోపనపల్లికి చెందిన బెల్లం మంజుల(27)తో ఐదేళ్ల క్రింత వివాహం జరిగింది. వీరికి కూతురు నిషిత(3) జన్మించిది. రమేష్‌ నెక్కొండలో ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తున్నాడు. కొంతకాలంగా భార్యాభర్తల మధ్య తరచూ ఆర్థిక పరమైన గొడవులు జరుగుతున్నాయి. ఏడాది క్రితం మంజుల అస్వస్థతకు గురికావడంతో ప్రైవేట్‌ ఆస్పత్రిలో నడుముకు శస్త్ర చికిత్స చేయించాడు. వైద్య ఖర్చులతో ఆర్థిక భారం పెరగడంతో కాపురంలో కలహాలు పెరిగి పంచాయితీ పెద్దమనుషుల వరకు పోయింది.

వారు చెప్పిన విధంగా నడుచుకుంటామని చెప్పారు. ఈ క్రమంలో శనివారం ఉదయం మళ్లీ గొడవ జరగడంతో తాను ఆత్మహత్య చేసుకుంటానంటూ మంజుల తన తమ్ముడు బెల్లం రాజుకు చెప్పి కూతురు నిషితను తీసుకుని నెక్కొండకు చేరుకుంది. సమీప ఊర చెరువు వద్దకు వెళ్లగా అక్కడ కొందరు వ్యక్తులు ఉండడంతో అక్కడి నుంచి ఓ వ్యవసాయ బావి వద్దకు చేరింది. ముందుగా కూతురు బావిలోకి తోసి తనూ దూకింది. పరిసరాల్లో చూసిన పలువురు తల్లీ కూతుళ్లు కనిపించకపోవడంతో బావి వద్దకు వెళ్లి పరిశీలించగా శవాలై కనిపించారు. దీంతో పోలీ సులకు సమాచారం ఇవ్వడంతో నెక్కొండ సీఐ పెద్దన్నకుమార్‌ సిబ్బందితో అక్కడికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. మృతురాలి తండ్రి బెల్లం ఎల్లయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాఫ్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement