గిరిసిల జంక్షన్‌లో..గుర్తు తెలియని మహిళ మృతి     | women killed | Sakshi
Sakshi News home page

గిరిసిల జంక్షన్‌లో..గుర్తు తెలియని మహిళ మృతి    

May 11 2018 1:26 PM | Updated on May 11 2018 1:27 PM

women killed - Sakshi

మహిళ మృతదేహం దగ్గర దర్యాప్తు చేస్తున్న గొళంతరా పోలీసులు

బరంపురం : నగర శివారు గిరిసిల జంక్షన్‌లో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహాన్ని పోలీసులు గురువారం కనుగొన్నారు. ఐఐసీ అధికారి ఆలేఖ్‌ జెనా అందించిన సమాచారం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఉదయం గొళంతర పోలీస్‌స్టేషన్‌ పరిధి లోని గిరిసిల జంక్షన్‌ ప్రాంగణంలో గల పొలాల్లో శరీరంపై ఎటువంటి ఆచ్ఛాదన లేకుండా పడి ఉ న్న గుర్తుతెలియని మహిళ మృతదేహం స్థానికుల కంట పడింది.

సమాచారం అందుకున్న గొళంతరా పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సైంటిఫిక్‌ బృందం, డాగ్‌ స్క్వాడ్‌కి సమాచారం అందజేశారు. సమచారం అందుకున్న సైంటిఫిక్‌ బృందం, డాగ్‌ స్క్వాడ్‌ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి ముందుకు వెళ్లాయి.  వాసన చూస్తూ డాగ్‌ స్క్వాడ్‌ ముందుకు వెళ్లడంతో  సైంటిఫిక్‌ బృందం సభ్యులు అణువణువునా అధారాలు సేకరించారు. అనంతరం గుర్తు తెలియని మహిళమృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్ట్‌మార్టం కోసం ఎంకేసీజీ మెడికల్‌ కళాశాలకు తరలించారు.

మహిళ మృతదేహాన్ని పరిశీలిస్తే మహిళపై లైంగికదాడికి పాల్పడి అనంతరం హత్య చేసినట్లు అనిపిస్తోందని పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మృతురాలిని 45 నుంచి 47 ఏళ్ల వయస్సులోపు గల తెలుగు మహిళగా సందేహిస్తున్నట్లు ఐఐసీ ఆలేఖ్‌జెనా తెలియజేస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని పోస్ట్‌మార్టం రిపోర్ట్‌ వచ్చిన అనంతరం వాస్తవాలు వెలుగులోకి రానున్నాయని ఐఐసీ చెప్పారు.  

Advertisement
 
Advertisement
Advertisement