మహిళా రైతుపై వీఆర్వో దాడి

 Women Farmer Attacked By Peddapalli VRO - Sakshi

పెద్దపల్లి జిల్లా మంథనిలో ఘటన

మంథని: పట్టా చేసేందుకు తీసుకున్న డబ్బు తిరిగి అడిగినందుకు ఓ మహిళా రైతులపై వీఆర్వో దాడి చేసిన ఘటన పెద్దపల్లి జిల్లా మంథనిలో గురువారం జరిగింది. నాగెపల్లికి చెందిన తన తండ్రి కొయ్యల దుర్గయ్య పేరిట పట్టా చేస్తానంటే మంథని మండలం అడవిసోమన్‌పల్లి వీఆర్వో సహీరాభానుకు రూ.30 వేలు ఇచ్చినట్లు దుర్గయ్య కూతురు సమ్మక్క తెలిపింది.

తన తండ్రి చనిపోయాక తల్లి పేరిట పట్టా చేస్తానని చెప్పడంతో ఏడాదిగా తిరుగుతున్నానని తెలిపింది. దీనిపై తహసీల్దార్‌కు ఫిర్యాదు చేస్తే.. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయమని చెప్పినట్లు వివరించింది. వీఆర్వో ఇంటికి వెళ్లి డబ్బులు అడగ్గానే దాడి చేసిందని చెప్పింది. తాను డబ్బులు తీసుకున్నానన్న ఆరోపణల్లో నిజం లేదని వీఆర్వో తెలిపారు. కాగా, వీరిద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Read latest Crime News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top