వివాహిత ఆత్మహత్య | Women Committed Suicide | Sakshi
Sakshi News home page

వివాహిత ఆత్మహత్య

Apr 5 2018 10:39 AM | Updated on Oct 16 2018 3:15 PM

Women Committed Suicide - Sakshi

రేణుక మృతదేహం 

రామాయంపేట(మెదక్‌): ఆర్థిక ఇబ్బందులతో వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మండలంలోని ఝాన్సిలింగాపూర్‌లో బుధవారం  జరిగింది. ఎస్‌ఐ మహేందర్‌ కథనం మేరకు..గ్రామానికి చెందిన  శ్రీనివాసరెడ్డి, రేణుక దంపతులకు ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్ద కూతురు ఇంటర్‌ చేస్తుండగా, రెండో కూతురు తొమ్మిదో తరగతి చదువుతోంది. కొంత కాలంగా శ్రీనివాసరెడ్డి ఏ పని చేయకపోవడంతో కుటుంబం గడవడం, పిల్లల చదివించడానికి ఇబ్బందులు పడుతున్నారు. దీంతో మనోవేదన చెందిన రేణుగ ఉదయం ఇంట్లో ఎవరూ లేనిసమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. కేసు నమోదు చేసుకుని ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement