సాయం పేరుతో మహిళపై దారుణం.. | A woman was Allegedly Confined And Raped In Rajasthan | Sakshi
Sakshi News home page

సాయం పేరుతో మహిళపై దారుణం..

Sep 3 2019 11:01 AM | Updated on Sep 3 2019 11:08 AM

A woman was Allegedly Confined And Raped In Rajasthan - Sakshi

ప్రతీకాత్మకచిత్రం

ఒంటరి మహిళపై కన్నేసిన ప్రబుద్ధుడు సాయం పేరుతో ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాజస్ధాన్‌లో చోటుచేసుకుంది.

జైపూర్‌ : భర్త వేధింపులకు విసిగి సాయం కోరి ఆశ్రయించిన మహిళను నిర్భందించిన ఓ వ్యక్తి ఆరు రోజుల పాటు ఆమెపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన రాజస్ధాన్‌లో వెలుగుచూసింది. తన భర్త నుంచి ఎదురవుతున్న గృహహింసను తాళలేక మహిళ బాబూలాల్‌ను అనే వ్యక్తిని సాయం కో​సం ఆశ్రయించగా, ఆమెను గదిలో నిర్భందించి ఈ దారుణానికి ఒడిగట్టాడని పోలీసులు వెల్లడించారు. తొలుత బాధిత మహిళకు సాయం చేసిన బాబూలాల్‌ ఆయన స్నేహితుడు కలిసి ఆమెకు తన భర్తపై పోలీసు కేసు పెట్టేందుకు సహకరించారు. రెండు రోజుల పాటు ఆమె ఉండేందుకు రూమ్‌ను ఏర్పాటు చేశారు. భర్తపై ఫిర్యాదు చేసిన అనంతరం ఆమె తన స్వగ్రామం లొహావత్‌కు తిరిగి వెళ్లారు. అయితే కొద్దిరోజుల తర్వాత స్టేట్‌మెంట్‌ నమోదు చేసేందుకు పోలీస్‌ స్టేషన్‌కు రావాలని ఆమెను పిలిపించిన బాబూలాల్‌, ఆయన స్నేహితుడు ఒమారమ్‌ బాధిత మహిళను అదే గదిలో బంధించారు. ఆరు రోజుల పాటు మహిళపై బాబూలాల్‌ లైంగిక దాడికి పాల్పడ్డాడు. మహిళ ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement