సిగరెట్ల డబ్బులడిగాడని.. మహిళ దౌర్జన్యం | Woman held for attacking shopkeeper in Thane | Sakshi
Sakshi News home page

సిగరెట్ల డబ్బులడిగాడని.. మహిళ దౌర్జన్యం

Nov 20 2017 12:42 PM | Updated on Sep 2 2018 4:03 PM

Woman held for attacking shopkeeper in Thane - Sakshi - Sakshi - Sakshi - Sakshi

థానే: అప్పుగా  ప్యాకెట్ల కొద్ది సిగరెట్లు తీసుకుంది. అమావాస్యకో, పౌర్ణమికో బాకీ చెల్లిస్తుంది. దీంతో విసుగెత్తిన దుకాణదారుడు తన బాకీ చెల్లించమని అడిగాడు. అంతే ఆవిడ గారికి కోపం వచ్చింది. నన్నే డబ్బు అడుగుతావా అంటూ కత్తితో దాడికి పాల్పడింది. అయినా సదరు మహిళ కోపం చల్లారలేదు. పక్కనే  దుకాణంలో కాగుతున్న వేడి టీని తీసుకొచ్చి దుకాణం యజమానిపై పోసింది..

వివరాల్లోకి వెళ్తే మహారాష్ట్రలోని థానే నగరం, నౌపడా ప్రాంతంలోని విష్ణు నగర్‌లో ఓ మహిళ(34) నివాసం ఉండేది. సమీపంలో ఓవ్యక్తి(75) సిగరెట్ల దుకాణానికి వచ్చి తరచూ సిగరెట్లు కొనుగోలు చేసేది. అయితే తీసుకున్న సిగరెట్లకు అప్పుడప్పుడు మాత్రమే డబ్బులు ఇచ్చేది. ఈ క్రమంలో ఈనెల18న కూడా ఆమె దుకాణానికి వచ్చి సిగరెట్లు ప్యాకెట్లు తీసుకుంది. అయితే సిగరెట్లకు డబ్బులు ఇవ్వమని దుకాణ నిర్వాహకుడు గట్టిగా అడగాడు. అంతే ఆవిడాగారికి కోపం వచ్చింది.

కోపంగా యజమానిని దూషిస్తూ షాపులోని కత్తి తీసుకుని దాడికి పాల్పడింది. అంతేగాక  బయటకు లాక్కొచ్చి కొట్టింది. అంతటితో అగకుండా పక్కనే దుకాణంలో కాగుతున్న టీ తీసుకొచ్చి దుకాణం యజమానిపై పోసి పారిపోయింది. స్థానికులు పరుగున వచ్చి దుకాణదారుడిని ఆస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఆ మహిళను అరెస్టు చేసినట్లు సీనియర్‌ పోలీసు అధికారి సి.జె.కాదవ్‌ వెల్లడించారు. మారణాయుధాలతో దాడి చేసిన, తోటి వ్యక్తికి ప్రాణభయం కలిగించడం, మోసం చేయడం నేరాల కింద కేసులు నమోదు చేసినట్లు పోలీసు అధికారి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement