హర్యానాలో విషాదం; బర్త్‌డే పార్టీకి వెళ్లి.. | Woman Dies While Returning From Her Birthday Party In haryana | Sakshi
Sakshi News home page

హర్యానాలో విషాదం; బర్త్‌డే పార్టీకి వెళ్లి..

Feb 27 2020 12:00 PM | Updated on Feb 27 2020 12:02 PM

Woman Dies While Returning From Her Birthday Party In haryana - Sakshi

చండీగఢ్‌ : హర్యానాలో విషాదం చోటుచేసుకుంది. పుట్టినరోజు వేడుకలు జరుపుకుని వస్తున్న ఓ కుటుంబం రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో మహిళ(26) మృతి చెందగా కుటుంబ సభ్యులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు.. చంఢీగడ్‌లో నివసిస్తున్న రాఘవ్‌ గుప్తాకు పదినెలల క్రితమే శ్రీస్టితో వివాహం జరిగింది. తాజాగా భార్య పుట్టినరోజు రావడంతో బర్త్‌డే వేడుకలు నిర్వహించడానికి విహారయాత్రకు బయల్దేరారు. మొత్తం ఆరుగురు కలిసి షిమ్లాకు వెళ్లగా అక్కడ ఓ హోటలో బర్త్‌డే పార్టీ జరుపుకున్నారు.

మంగళవారం రాత్రి తిరుగు ప్రయాణం అవ్వగా.. ప్రమాదవశాత్తు రహదారిపై సైన్‌ బోర్డు స్తంభానికి కారు ఢీ కొట్టింది. దీంతో కారు ఇంజన్‌ పూర్తిగా ధ్వంసమై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో  ఆరుగురికి తీవ్ర గాయాలవ్వగా.. వారిని హుటాహుటినా స్థానిక ఆసుపత్రికి తరలించారు. కాగా అప్పటికే శ్రిష్టి మరణించినట్లు వైద్యులు ధృవీకరించారు. మిగతా కుటుంబ సభ్యుల ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. కాగా  అతివేగమే ప్రమాదానికి కారణమని పోలీసులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. విచారణ చేపట్టారు. మరోవైపు రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ముగ్గురు వ్యక్తులను వేగంగా వస్తున్న ట్రక్కు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో జగత్‌పాల్‌(36), సునీల్‌(35)అక్కడిక్కడే మరణించగా అధేష్‌ కుమార్‌ పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement