మనస్తాపంతో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన మహిళ | woman climb water tank trying to suicide | Sakshi
Sakshi News home page

మనస్తాపంతో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన మహిళ

Feb 1 2018 9:38 AM | Updated on Feb 1 2018 9:38 AM

woman climb water tank trying to suicide - Sakshi

వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన లక్ష్మి

వట్టిచెరుకూరు(ప్రత్తిపాడు): వట్టిచెరుకూరు మండలం పుల్లడిగుంట గ్రామానికి చెందిన పి.లక్ష్మి అలియాస్‌ అంకమ్మ అనే మహిళ వాటర్‌ ట్యాంక్‌ ఎక్కిన సంఘటన బుధవారం చోటుచేసుకుంది. లక్ష్మి ఒక్కసారిగా వాటర్‌ ట్యాంక్‌ ఎక్కడంతో గ్రామంలో టెన్షన్‌ వాతవరణం ఏర్పడింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం.. పుల్లడిగుంటకు చెందిన  పి.లక్ష్మి పాత మద్రాస్‌ రోడ్డు పక్కన తోపుడు బండిపై టిఫిన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తోంది. గతేడాది నవంబరులో పాత మద్రాస్‌ రోడ్డు వెడల్పు చేయడంతో రోడ్డు పక్కన ఏర్పాటు చేసుకున్న టిఫిన్‌ బండిని తీసి వేయాల్సివచ్చింది.

దీనికి ప్రత్యామ్నాయంగా లక్ష్మి గుంటూరు వైపు రోడ్డులో టిఫిన్‌ సెంటర్‌ ఏర్పాటు చేసుకుంది. రోడ్డు విస్తరణ పనులు పూర్తి కావడంతో గతంలో తాను టిఫిన్‌ సెంటర్‌ పెట్టుకున్న ప్రదేశంలో తిరిగి టిఫిన్‌ బండి పెట్టుకుందామని వెళ్లగా, అప్పటికే వేరే వ్యక్తి అక్కడ టిఫిన్‌ సెంటర్‌ ఏర్పాటు చేయటంతో ఇద్దరి మధ్య  వివాదం జరిగింది దీంతో మనస్తాపంతో వాటర్‌ ట్యాంక్‌ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలిపారు.  పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి లక్ష్మితో మాట్లాడి కిందికి దించారు. పోలిస్‌స్టేషన్‌కు అక్కడ నుంచి తహసీల్దార్‌ కార్యాలయానికి తీసుకెళ్లి కౌన్సిలింగ్‌ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement